ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు రాని అభ్యర్థులు దేశంలోని ప్రైవేట్ కాలేజీల్లో, విదేశీ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తారు. అక్కడ కూడా అడ్మిషన్ దొరకనప్పుడు నీట్ మార్కుల ఆధారంగా డిఫరెంట్ కోర్సులు చేయొచ్చని వివరించారు అన్అకాడమీ నీట్ యూజీ ఎడ్యుకేటర్ సీప్ పహుజ. ఈ కోర్సులకు మార్కులు ఎంబీబీఎస్(MBBS) అంతస్థాయిలో అవసరం లేదని, తక్కువ వచ్చినా చేయొచ్చని చెప్పారు. ఇంకా కొన్ని కోర్సులకు అయితే నీట్ మార్కులు అవసరం లేదని స్పష్టం చేశారు.
* అందుబాటులో ఉన్న కోర్సులు : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మార్కులు అవసరం లేకుండానే మెడికల్ ఫీల్డ్‌లో కొన్ని కోర్సులు ఉన్నాయి. అవి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(BDS), ఆయుష్ కోర్సులు(BAMS, BSMS, BUMS, BHMS), బ్యాచిలర్ ఇన్ వెటర్నరీ సర్వీస్(B.V.Sc), అగ్రికల్చర్, రేడియోగ్రఫీ, ల్యాబ్ టెక్, క్లినికల్ రీసెర్చ్, బయో టెక్నాలజీ, ఫిజయాలజీ, మైక్రో బయాలజీ, లైఫ్ సైన్సెస్, సైకాలజీ తదితర బీఎస్సీ(B.Sc.) కోర్సులు.
* విదేశాల్లో మెడిసిన్ అవకాశాలు : విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులు ఎన్ఎంసీ గెజిట్ 2021 మార్గదర్శకాల (NMC Gazette 2021) ప్రకారం జాగ్రత్తగా దేశం, కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో, విదేశాల్లో మెడిసిన్ చదివిన విద్యార్థులు ఇండియాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడం కోసం నెక్స్ట్ టెస్ట్ రాసి (National Exit Test -NExT ) లైసెన్స్ పొందాలి.
భారతదేశంలో పరిమితమైన సీట్లు అందుబాటులో ఉండి పోటీ పెరిగిన నేపథ్యంలో కొద్ది మందికి మాత్రమే ఎంబీబీఎస్ చదివే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. రష్యా, నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్థాన్, ఉక్రెయిన్ దేశాల్లో భారత విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. అయితే, కొందరు అభ్యర్థులు ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్‌లో (Foreign Medical Graduate Examination- FMGE) ఫెయిల్ అవుతామని భయపడే వారున్నారు. వారు నీట్ యూజీ తర్వాత కూడా విదేశాల్లో చదువుకోవచ్చు.