1. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్-NBCC ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈ సంస్థ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఢిల్లీ, ఒడిషా, జార్ఖండ్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. వ్యవధి రెండేళ్లు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 15 చివరి తేదీ. దరఖాస్తు చేసిన తర్వాత నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలో అప్లికేషన్ ఫామ్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే ఇంజనీర్ (సివిల్) పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. దరఖాస్తు ఫీజు రూ.550. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు ఫీజు లేదు. వేతనం రూ.42,500. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: General Manager (HRM), NBCC (I) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003. (ప్రతీకాత్మక చిత్రం)