1. కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏజెన్సీ త్వరలో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహించనుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం లేకపోయి ఉంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ఈ ఏడాదిలోనే జరిగేది. కానీ 2022 ప్రారంభంలోనే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు ప్రధాన మంత్రి మోదీ చొరవతో ఏర్పాటైన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA ఈ ఏడాది చివరిలోగా పరీక్ష నిర్వహించాల్సి ఉందని, కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జాప్యం అవుతోందని ఆయన అన్నారు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతో ఏర్పాటు చేశామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS నిర్వహిస్తున్న పరీక్షలు కాకుండా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బీ, గ్రూప్ సీ (నాన్ టెక్నికల్) పోస్టులకు ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA మల్టీ ఏజెన్సీ బాడీగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలోని ప్రతీ జిల్లాలో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని అభ్యర్థులు కూడా ఈ పరీక్ష రాయొచ్చని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET మూడు లెవెల్స్‌లో ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి వేర్వేరుగా ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ మొదటి స్టేజ్ క్లియర్ చేయొచ్చు. రెండో స్టేజ్, మూడో స్టేజ్, ఇంటర్వ్యూలను ఆయా సంస్థలు స్వయంగా నిర్వహిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)