1. భారతీయ రైల్వేలో ఉద్యోగం మీ కలా? ఇండియన్ రైల్వేస్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. భారతీయ రైల్వే కొత్త కోర్సుల్ని ప్రకటించింది. భారతీయ రైల్వేకు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్-NRTI పేరుతో విద్యా సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు ఈ విద్యా సంస్థ పలు కోర్సుల్ని అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్-NRTI లో కొత్త గా రెండు బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, రెండు ఎంబీఏ కోర్సులు మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌ని ప్రకటించింది భారతీయ రైల్వే. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ కమ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ లాంటి స్కిల్స్ నేర్పించే 7 ప్రోగ్రామ్స్‌ను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రెండు బీటెక్ ప్రోగ్రామ్స్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌కు సంబంధించినవి కాగా, రెండు ఎంబీఏ ప్రోగ్రామ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై మేనేజ్మెంట్కు సంబంధించినవి. ఇక మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్, సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, పాలసీ, ఎకనమిక్స్‌కు సంబంధించినవి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సుల్లో బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్- 3 ఏళ్లు, బీఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ- 3 ఏళ్లు, బీటెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్- 4 ఏళ్లు, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 4 ఏళ్లు కోర్సులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. వీటితో పాటు ఎంబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్- 2 ఏళ్లు, ఎంబీఏ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్- 2 ఏళ్లు, ఎంఎస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్- 2 ఏళ్లు, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ- 2 ఏళ్లు, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్- 2 ఏళ్లు కోర్సులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)