అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. నవంబర్ 13న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష మొత్తం 145 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.nainitalbank.co.in సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
సబ్జెక్ట్ వారీగా మార్కుల్లో.. రీజనింగ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)