ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద.. భారత పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు.