Covid 19 Exam Guidlines: ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? రూల్స్ మార్చిన కేంద్ర ప్రభుత్వం
Covid 19 Exam Guidlines: ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? రూల్స్ మార్చిన కేంద్ర ప్రభుత్వం
Covid 19 Exam Guidlines | ఇటీవల జేఈఈ మెయిన్స్ 2020 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. నీట్ 2020 ఎగ్జామ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు... రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు ఇతర పరీక్షల్ని నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు గైడ్‌లైన్స్‌ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
1. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ మహమ్మారి కాలంలో పరీక్షల నిర్వహణకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్‌ని సవరించింది. పరీక్షలు నిర్వహించే విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలతో పాటు ఇతరులకు ఇవి వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
2. పరీక్షా కేంద్రాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది వస్తుంటారని, నిర్దిష్ట నివారణ చర్యలను అనుసరిస్తూ పరీక్షల్ని నిర్వహించాలని ఈ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
3. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం, ఫేస్ కవర్స్, మాస్కులు ధరించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లు ఉపయోగించడం లాంటి సాధారణ సూచనలు ఇప్పటికే వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
4. వీటితో పాటు పరీక్షల నిర్వహణకు గతంలో వెల్లడించిన గైడ్‌లైన్స్ సవరించింది. కంటైన్మెంట్ జోన్లో లేని పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. కంటైన్మెంట్ జోన్లకు చెందిన సిబ్బంది, పరీక్ష నిర్వాహకులను అనుమతించరు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
5. పరీక్ష కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు పరీక్ష షెడ్యూల్‌ను అస్థిర పద్ధతిలో రూపొందించాలి. పరీక్ష కేంద్రాల్లో ఉన్న గదులు, సీటింగ్ అరేంజ్మెంట్ లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ ప్రకటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
6. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ కవర్స్, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్, సబ్బు లాంటివి అందుబాటులో ఉంచాలి. పరీక్షా నిర్వాహకులు, సిబ్బంది ముందుగానే తమ ఆరోగ్యానికి సంబంధించిన స్టేటస్‌ను వెల్లడిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
7. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్‌ను పరీక్ష నిర్వహించే సంస్థలు అందజేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
8. అడ్మిట్ కార్డులతో పాటు ఏమేమి తప్పనిసరిగా తీసుకెళ్లాలో విద్యార్థులకు పరీక్షా నిర్వాహకులు వివరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
9. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ లాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు తగినంత సిబ్బందిని నియమించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
10. విద్యార్థుల్లో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేషన్ రూమ్‌కు తరలించాలి. ఆ తర్వాత వైద్య సలహా తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
11. పరీక్షా కేంద్రాల్లో ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లో హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. రద్దీ లేకుండా ఎంట్రెన్స్, ఎగ్జిట్ ఏర్పాటు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)