స్టడీ సెంటర్లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం.. ఉచిత భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు.. అభ్యర్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ఇంక ముందు నిర్వహించబోయే ఉద్యోగాల భర్తీకి సంబంధించి పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
వీటికి రాజకీయ రంగు పూయొద్దని.. నిరుద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సిట్ విచారణ పూర్తి కాకుండానే SIT పై నమ్మకం లేదనడం కరెక్ట్ కాదన్నారు. రాజశేఖర్ 2017లో రీక్యూట్ అయ్యాడు..విచారణలో అన్ని బయటపడతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చాలా మార్పులు వస్తాయి...నిపుణుల తో చర్చలు జరుపుతున్నామన్నారు. మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)