బాసర ట్రిపుల్ ఐటీ ఐదవ స్నాతకోత్సవానికి మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు.
సెప్టెంబరు, 2022లో బాసర ఆర్జికేయూటీకి విచ్చేసి విద్యార్థులకు చేసిన వాగ్దానం మేరకు మంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీ ఐదవ స్నాతకోత్సవంలో తన సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, P1 & P2 విద్యార్థులకు డెస్క్ టాప్ లు అందజేశారు.