1. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES దేశవ్యాప్తంగా డ్రాఫ్ట్మ్యాన్, సూపర్వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 502 ఖాళీలను ప్రకటించింది. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. మొత్తం 502 ఖాళీలు ఉండగా అందులో సూపర్వైజర్ పోస్టులు 450, డ్రాఫ్ట్మ్యాన్ పోస్టులు 52 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్లో విద్యార్హతల వివరాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఆసక్తి గల అభ్యర్థులు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES అధికారిక వెబ్సైట్ https://mes.gov.in/ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)