1. భారతదేశంలో బీమా రంగంలో దిగ్గజ సంస్థ ఏది అంటే గుర్తొచ్చేది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఎల్ఐసీ ఒకటి. ఎల్ఐసీ నెట్వర్క్ గ్రామగ్రామానికి విస్తరించింది. ఎల్ఐసీ ఏజెంట్లు ప్రతీ గ్రామంలో కనిపిస్తారు. దేశవ్యాప్తంగా 13 లక్షలకు పైగా ఎల్ఐసీ ఏజెంట్లు (LIC Agent) ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరి మీరు కూడా ఎల్ఐసీ ఏజెంట్‌గా కెరీర్ రూపొందించాలనుకుంటున్నారా? ఎల్ఐసీ ఏజెంట్‌గా మారాలనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. గతంలో ఎల్ఐసీ ఆఫీస్‌కి వెళ్లి అప్లై చేయాల్సి వచ్చేది. లేదా ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లోనే దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఎల్ఐసీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారతదేశంలో బీమా రంగం విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కొన్నేళ్ల పాటు విస్తరించే సత్తా ఉన్న బీమా రంగంలో ఎల్ఐసీ సత్తా చాటడం ఖాయం. అందుకే ఎల్ఐసీ ఏజెంట్ కావడానికి పోటీపడుతుంటారు. ఎల్ఐసీ ఏజెంట్‌గా మారితే రోజూ ఇన్ని గంటలు పనిచేయాలన్న కండీషన్ ఉండదు. ఎప్పుడు ఖాళీ సమయం ఉంటే అప్పుడు పనిచేసుకోవచ్చు. విద్యార్థులు, గృహిణులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు కోరుకునేవారు ఎల్ఐసీ ఏజెంట్‌గా మారొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ ఏజెంట్లకు సంస్థ నుంచి ఉచితంగా శిక్షణ లభిస్తుంది. సెమినార్లు కూడా ఉంటాయి. సంపాదన విషయానికి వస్తే ఎల్ఐసీ ఏజెంట్‌కు వేతనం ఉండదు. కానీ ఎంత కష్టపడితే అంత సంపాదన వస్తుంది. ప్రతీ పాలసీకి కమిషన్ ఉంటుంది. ఎల్ఐసీ నుంచి పలు రివార్డ్స్ కూడా ఉంటాయి. సేల్స్ ఇన్సెంటీవ్స్ లభిస్తాయి. పాలసీ అమ్మినప్పుడు ఫస్ట్ కమిషన్ వస్తుంది. ప్రతీ ఏటా పాలసీ రెన్యువల్ చేస్తే రెన్యువల్ కమిషన్ వస్తుంది. వీటితో పాటు బోనస్ కమిషన్, హెరిడిటరీ కమిషన్ కూడా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఎల్ఐసీ నిర్వహించే కాంపిటీషన్లలో పాల్గొని ప్రైజ్‌లు గెలుచుకోవచ్చు. గ్రాట్యుటీ, టర్మ్ ఇన్స్యూరెన్స్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్, పెన్షన్ స్కీమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ స్కీమ్ లాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి స్పాన్సర్షిప్ లభిస్తుంది. ఆఫీస్ అలవెన్స్ కూడా లభిస్తుంది. టూవీలర్, ఫోర్ వీలర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ కొనడానికి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఫెళ్లిళ్లు, పండుగల కోసం అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక హౌజింగ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటులో మినహాయింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకునేవారు https://licindia.in/agent/index.html పోర్టల్ ఓపెన్ చేయాలి. Apply Now పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోటో, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)