1. దిగ్గజ ఇన్స్యూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎల్ఐసీలో ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ (Insurance Advisor) పోస్టులున్నాయి. మొత్తం 300 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఎంపికైనవారు ఎల్ఐసీలో పార్ట్ టైమ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వహించాలి. అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మార్కెట్ సర్వే, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 300 ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ పోస్టులున్నాయి. ఇవి పార్ట్ టైమ్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 31 చివరి తేదీ. 10వ తరగతి పాస్ కావాలి. ఒక ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ అనుభవం ఉండాలి మార్కెటింగ్, సేల్స్ స్కిల్స్ తెలిసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Latest Jobs పైన క్లిక్ చేసిన తర్వాత LIC of India అని సెర్చ్ చేయాలి. ఎల్ఐసీ ఉద్యోగాలకు సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి. క్లిక్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త యూజర్ అయితే New User పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. Register As పైన క్లిక్ చేసి Jobseeker ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నియమనిబంధనలు అంగీకరించి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ లాగిన్ వివరాలతో లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్‌లో ఇతర సెక్షన్స్ పూర్తి చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి DigiLocker connect చేయొచ్చు. ఆ తర్వాత ఎల్ఐసీ అడ్వైజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి. పాత యూజర్ అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. జాబ్ సెర్చ్‌లో ఎల్ఐసీ అడ్వజర్ పోస్టును సెర్చ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకు సమాచారం అందుతుంది. ఎంపికైనవారికి నెలకు రూ.7,000 నుంచి రూ.25,000 వరకు వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)