1. భారతదేశంలో ఇన్స్యూరెన్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ (Insurance Advisor) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వానికి ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాల్లో వీరిని నియమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ హోదాలో మార్కెటింగ్ అండ్ సేల్స్ విధులు నిర్వహించాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇవి పార్ట్ టైమ్ ఉద్యోగాలు మాత్రమే. న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థులకు రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ అనుభవం ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ లాంటి అంశాల్లో స్కిల్స్ ఉండాలి. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. రూ.25,000 వరకు వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇవి పార్ట్ టైమ్ పోస్టులు మాత్రమే. న్యూ ఢిల్లీలో ఉంటున్నవారికి ఈ పార్ట్ టైమ్ జాబ్ సూటబుల్‌గా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చేయాలి. ఎల్ఐసీ జాబ్ పోస్టింగ్‌లో Apply పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త యూజర్ అయితే New User పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. Register As పైన క్లిక్ చేసి Jobseeker ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నియమనిబంధనలు అంగీకరించి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)