రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో ఐటీ సంస్థలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. ఏస్ స్టాక్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో ఐటీ రంగం గణనీయమైన వృద్ధి సాధిస్తుందని రాకేష్ జున్‌జున్‌వాలా అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
దాదాపు 50 లక్షల మంది కొత్త ఉద్యోగులకు అవకాశాలు వస్తాయన్నారు. వీటిలో సగానికి పైగా అంటే దాదాపు 56 శాతం కొత్త నియామకాలు 2022లోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రారంభ ఐటీ నిపుణులుగా కెరీర్ స్టార్ట్ చేసే వీరంతా రాబోయే సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరింత ప్రొడక్టివిటీ ఇస్తారని తెలిపారు. రాకేష్ జున్‌జున్‌వాలా వ్యాఖ్యలతో దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగార్ధుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురించినట్లైంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఉత్తమ నైపుణ్యాలు(TOP SKILLS)..
మరోవైపు.. కృత్రిమ మేధ(Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్(Machine Learning), కస్టమర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్(Cloud Computing), డేటా అనలిటిక్స్(Data Analytics), డేటా సైన్స్ వంటి కోర్సులకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో నైపుణ్యం సంపాదించిన వారే ఉత్తమ పొజిషన్లో ఉంటారని ఆ సర్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
భవిష్యత్తులో రిక్రూట్మెంట్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ జాబితాలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ముందువరుసలో నిలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 55,000 పైగా ఫ్రెషర్స్‌ని నియమించుకోనుందని సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 55,000 పైగా కాలేజ్ గ్రాడ్యుయేట్స్‌ని నియమించుకుంటున్నామని, త్వరలోనే ఈ నియామక ప్రక్రియ ముగుస్తుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)