1. పలు చిన్నా, పెద్ద ఐటీ సంస్థలతోపాటు స్టార్టఫ్ కంపెనీలు, సాంకేతిక రంగంలో పనిచేస్తున్న 15,000 మంది వ్యక్తులు మే నెలలో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. లేఆఫ్ అగ్రిగేటర్ layoffs.fyi ప్రకారం, ఈ నెలలో 15,000 కంటే ఎక్కువ మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. తాజాగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో సేవల్ని నిలిపివేశాయి. వికీపీడియా లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కంపెనీలు రష్యాలో కార్యాకలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన మైక్రోసాఫ్ట్ ప్రకటన ఆ సంస్థలో పనిచేస్తున్న 400మంది ఉద్యోగులు రోడ్డున పడేలా చేసింది. ప్రొడక్ట్ అమ్మకాల తగ్గింపు కారణంగా తలెత్తుతున్న నష్టాలు, ఇతరాత్ర కారణాల వల్ల ఆ 400మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉద్యోగుల్ని తొలగించినా వారికి సంస్థ సహాయ,సహకారాలు ఉంటాయని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1980 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టంను ఐబిఎం కంప్యూటర్స్‌తో కలిసి బిల్డ్ చేస్తుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ - రష్యా పరిణామాల నేపథ్యంలో ఐబీఎం రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేసింది. ఐబీఎం తర్వాత మైక్రోసాఫ్ట్ రష్యా నుంచి వైదొలొగుతున్నట్లు ప్రకటించింన విషయం తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎడ్టెక్ నుంచి ఇ-కామర్స్ మరియు హెల్త్‌టెక్ వర్టికల్స్ వరకు స్టార్టప్‌ల నుండి వేలాది మందిని తొలగించినందున, మహమ్మారి సంవత్సరాల్లో ప్రారంభమైన బ్లాక్‌బస్టర్ స్టార్టప్ పార్టీ ముగిసినట్లు కనిపిస్తోంది. ఆర్థికమాంద్యం ముంచుకొస్తుండటం, నిధులు ఎండిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. (ప్రతీకాత్మక చిత్రం)