Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. పూర్తి వివరాలు ఇలా..
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. పూర్తి వివరాలు ఇలా..
Railway Jobs: భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ ఇండియన్ రైల్వే. అందులో ఉద్యోగం అంటే ఎవరైనా ఇష్టపడతారు. తాజాగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబయిలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అందులో.. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 13
1. డిప్యూటీ జనరల్ మేనేజర్(01) పోస్టు కేవలం ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి దరఖాస్తు చేసుకునే వారు సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలంటూ పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
వయస్సు జూలై 1, 2021 నాటికి 45 ఏళ్లకు మించకూడదని తెలిపారు. దీనికి నెలకు జీతం రూ. 92,200 జీతం చెల్లించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏఓ) దీనిలో 02 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత సాధించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
దీనికి వయస్సు జూలై 1 , 2021నాటికి 35 ఏళ్లకు మించకూడదని పేర్కొన్నారు. దీనికి జీతం రూ. 65, 650 జీతం చెల్లించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
3.సెక్షన్ ఆఫీసర్ (02) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా బీకాం ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అకౌంట్స్ విభాగంలో ఏడేళ్ల అనుభవం ఉండాలన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
జూలై 1 , 2021 నాటికి 40 ఏళ్లకు మించకూడదని పేర్కొన్నారు. దీనికి నెలకు జీతం రూ55,700 జీతం చెల్లించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
4. అకౌంట్స్ అసిస్టెంట్లు (07) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీకాం ఉత్తీర్ణతతో పాటు అకౌంట్స్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
దీనికి వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లకు మించకూడదని పేర్కొన్నారు. దీనికి జీతం రూ.34,200 జీతం చెల్లించనున్నారు. దరఖాస్తు చేయాలని ఉంటే ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ తీసి వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించి పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 13
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 1, 2021గా నిర్ణయించారు. పూర్తి వివరాలు https://konkanrailway.com/ వెబ్ సైట్ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)