తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే నోటిఫికేషన్.. పోస్టుల వారీగా ఖాళీల వివరాలివే..
తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే నోటిఫికేషన్.. పోస్టుల వారీగా ఖాళీల వివరాలివే..
Telangana Police Recruitment: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో దాదాపు 20 వేల కొలువులు పోలీసులు శాఖకు చెందినవి ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
సీఎం ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో కొలువుల సందడి మొదలైంది. నిరుద్యోగులు ఉత్సాహంగా ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ మొత్తం ఉద్యోగాల్లో పోలీసు ఉద్యోగాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
సీఎం ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో దాదాపు 20 వేల కొలువులు పోలీసులు శాఖకు చెందినవి ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త జిల్లాలు, మండలాలు, కమిషరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఈ నేపథ్యంలో ఆ ఖాళీలు దాదాపు 20 వేల వరకు ఉంటాయన్నది అధికారుల అంచనా. తాజాగా ఈ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 425 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. అందులో సివిల్ ఎస్ఐ-368, ఏఆర్-29, కమ్యూనికేషన్స్-18 పోస్టులు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
వీటితో పాటు భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ ప్రభుత్వానికి అందించిన తన నివేదికలో పేర్కొంది. మొత్తం 19,300 కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇందులో సివిల్-7764, ఏఆర్-6683, టీఎస్ఎస్పీ-3874, కమ్యూనికేషన్స్-256, 15వ బెటాలియన్లో మరో 561 ఖాళీలు ఉన్నాయని పోలీసు శాఖ ప్రభుత్వానికి తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇదిలా ఉంటే వయోపరిమితిని సడలించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)