1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కాగా, రాష్ట్రంలో 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చినట్లు నాయక్ తెలిపారు. మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. రూపొందిస్తున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ), నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ, ఐటీ ఈ–సీ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా కడప జిల్లాలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 31, 2022 వరకు అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)