Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. బీటెక్ అభ్యర్థులకు అవకాశం..
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. బీటెక్ అభ్యర్థులకు అవకాశం..
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 137) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 137) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
దీనిలో సివిల్ ఇంజినీరింగ్‌లో 11, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 9, ఎలక్ట్రికల్‌లో 3, ఎలక్ట్రానిక్స్‌లో 6, మెకానికల్‌లో 9, ఇతర ఇంజినీరింగ్‌లో 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 40 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో TGC రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు మరియు 27 సంవత్సరాలకు మించకూడదు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇంజనీరింగ్ డిగ్రీలో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఐదు రోజుల పాటు జరిగే SSB ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
వీటితో పాటు.. సీఆర్పీఎఫ్ నుంచి కూడా 300లకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ www.crpf.gov.inని సందర్శించొచ్చు.