* టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తంగా 833 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,810 నుంచి రూ.1,24,150 (పోస్ట్‌ను బట్టి) మధ్య వేతనం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ అక్టోబర్ 21.
* నాబార్డ్ రిక్రూట్మెంట్ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD).. భారీ రిక్రూట్మెంట్ చేపడుతోంది. డెవలప్మెంట్ అసిస్టెంట్, డెవలప్మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 177 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 34,990 జీతం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
* నీతిఆయోగ్ రిక్రూట్మెంట్ : నీతిఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 22 యంగ్ ప్రొఫెషనల్ కాగా, మరో 6 కన్సల్టెంట్ గ్రేడ్ I పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ రెండేళ్ల ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షల వరకు జీతం లభిస్తుంది.
* రైల్వే స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్ : ఇండియన్ రైల్వేస్‌కు చెందిన మహారాష్ట్ర భుసావల్ డివిజన్ తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. డివిజనల్ రైల్వే స్కూల్(ఇంగ్లీష్ మీడియం)లో వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్. ఎంపికైన అభ్యర్థులు గరిష్టంగా 200 రోజులు, కనిష్టంగా 7 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 4న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య DRM ఆఫీస్, భుసావల్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
* ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ : ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీ కోసం పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,200 వరకు జీతం లభిస్తుంది. అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 300 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* బీహెచ్ఈఎల్లో జాబ్స్ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కుభారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులుబీహెచ్ఈఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 4 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తంగా 150 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్, మెకానికల్, ఐటీ, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, ఫైనాన్స్, హెచ్ఆర్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో అన్ని పోస్టులకు నెలకు రూ.50,000 జీతం లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థులకు రూ. 60,000 - రూ.1,80,000 స్కేల్ పే లభిస్తుంది. ఇందులో బేసిక్ పే రూ. 60,000 వరకు ఉంటుంది.