ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తాజాగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టాయి. ఎయిమ్స్, ఏఏఐ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ మొదలుకొని ఎస్బీఐ, ఏపీపీఎస్సీ వంటి అనేక సంస్థలు రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపడుతున్నాయి. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఏవో చూద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI).. వెస్ట్రన్ రీజియన్ ఎయిర్‌పోర్టుల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాకు చెందిన అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 14. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,10,000 వరకు జీతం లభించనుంది
ఎస్బీఐ , ఎస్బీఐ క్లర్క్ జాబ్స్, ఎస్బీఐ జాబ్స్, ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్" width="1600" height="1600" /> స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 47 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000వరకు జీతం లభించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
సర్కార్ నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తాజాగా నిరుద్యోగుల కోసం ‘తమిళనాడు ప్రైవేట్ జాబ్ పోర్టల్’ పేరుతో ఓ వెబ్సైట్ లాంచ్ చేసింది. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు ఈ వెబ్సైట్ సహకారం అందించనుంది. ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో దాదాపు 4,814 కంపెనీలు ఎంప్లాయర్స్‌గా రిజిస్టర్ అయ్యాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వివిధ రిపోర్ట్స్ ప్రకారం 42 ఆక్యుపేషనల్ కేటగిరీల్లో దాదాపు 1,01,703 ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్(AIIMS-Bhubaneshwar).. ఓ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ చేపడుతోంది. అయితే ఈ నియామక ప్రక్రియ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్‌గా ఉంటుంది. ఎక్స్ట్రామ్యూరల్ ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ కన్సల్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను ఎయిమ్స్ భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారమ్‌ను labhematologyaiimsbbsr@gmail.comకు అక్టోబర్ 25లోపు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000 జీతం లభించనుంది.(Photo credit : Medical Dialouge)