కరోనా విజృంభణ నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ను నిర్వహించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్ ఏర్పాట్లు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం) ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. బీటెక్, బీఫార్మసీ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ను జులై 5 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు పూర్తి పరీక్ష షెడ్యూల్, ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://jntuh.ac.in/ ను సందర్శించాలని సూచించారు.