తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకూ కేసుల సంక్య నిన్న ఏకంగా రెండే వేలకు పైగా కేసులతో పాటు మూడు మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పలు యూనివర్సిటీలు కూడా ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. జేఎన్టీయూ పరిధిలో జనవరి 10-12 మధ్య జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తూ అధికారులు ప్రకటించించారు. ఈ పరీక్షలను జనవరి 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు బీటెక్, బీఫార్మసీ 3, 4 సంవత్సరాల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ తేదీలను కూడా మర్చినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ హుస్సేన్ వెల్లడించారు.
ప్రస్తుతం వాయిదా పడిన ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షలు(IGNOU TEE) 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 23 వరకు జరగాల్సి ఉంది. పరీక్షల ప్రారంభానికి 15 రోజుల ముందు ignou.ac.in వెబ్సైట్లో(Website) షెడ్యూల్ను(Shedule) విడుదల చేస్తుంటుంది. అందువల్ల తదుపరి షెడ్యూల్ కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ignou.ac.inను చెక్ చేస్తుండాలని ఇగ్నో(Ignou) పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)