తెలంగాణలో బీటెక్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మరో 4 నూతన ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ తాజాగా నిర్ణయించింది.
2/ 6
ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర రాగానే కాలేజీల ఏర్పాటుకు చర్యలను ప్రారంభించనుంది జేఎన్టీయూ. గురువారం జరిగిన జేఎన్టీయూ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాగా.. ఈసీ సభ్యుల నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
3/ 6
ప్రస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ తో పాటు సుల్తాన్ పూర్, జగిత్యాల, మంథని, సిరిసిల్ల, వనపర్తిలలో ఇంజినీరింగ్ కళాశాలలను జేఎన్టీయూ ఆధ్వరంలో నిర్వహిస్తున్నారు.
4/ 6
ఇంకా.. ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరింత మంది పేద విద్యార్థులకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
5/ 6
ఉన్నత విద్యామండలి నుంచి నివేదిక వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం కొత్త ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టనుంది. సీఎం ఆమోద ముద్ర తర్వాత ఖమ్మం, నిజామాబాద్, మహబూబాబాద్ తో పాటు మరో ప్రాంతంలోనూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కానుంది.
6/ 6
కొత్త ఇంజినీరింగ్ కలేజీలకు కావాల్సిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మౌలిక సదుపాయాలపై ఈసీ సభ్యులు చర్చించారు. ఇంకా.. వనపర్తి, సిరిసిల్లలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల ఏర్పాటుకు నిధులను కేటాయించారు.