2. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని టోక్యో నగరానికి చెందిన 38 ఏళ్ల షోజి మోరిమోటో (Shoji Morimoto) గతంలో ఒక పబ్లిషింగ్ కంపెనీలో పని చేసేవాడు. ఆ సమయంలో పని సరిగా చేయకపోతే ఆ కంపెనీ వారు తిట్టేవారు. ఎలాంటి పని చేయకుండా అసలు ఎలా ఉంటావని దూషించేవారు. అయితే ఏమీ చేయకపోవడమే తనలోని ప్రత్యేక సామర్థ్యమని అతడు గుర్తించాడు. ఇప్పుడు ఆ టాలెంట్‌తోనే డబ్బు సంపాదిస్తున్నాడు. (image: Shoji Morimoto / twitter)
3. కేవలం ఒంటరిగా ఉన్న వ్యక్తులకు తోడుగా ఉండే వింత జాబ్‌ను క్రియేట్ చేసుకున్నాడు షోజి. తన క్లయింట్లకు అతడు ఎలాంటి పనులు చేసి పెట్టడు. కానీ కాసేపు వారితో సాధారణ సమయం గడుపుతాడు. కరోనాకు ముందు షోజిని డైలీ నలుగురు రెంట్‌కు తీసుకునేవారు. ఇప్పుడు కనీసం ఇద్దరు అతన్ని అద్దెకు తీసుకుని తమకు తోడుగా ఉంచుకుంటున్నారు. (image: Shoji Morimoto / twitter)
4. అలా అతడు రోజు దాదాపు రూ.10 వేలు సంపాదిస్తూ దీనిని ఫుల్ టైమ్ వర్క్‌గా మార్చుకున్నాడు. ఈ జాబ్ సులభమే కాదు అధిక డబ్బులను కూడా అతడికి తెచ్చిపెడుతోంది. కేవలం తోడుగా ఉన్నందుకు షోజి గంటకు 10,000 యెన్ (71 డాలర్లు లేదా సుమారు రూ.5,673) సంపాదిస్తున్నాడు. ఒకసారి ఒక ట్రావెలర్‌కు జస్ట్ హాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చినందుకే ఇతడు రూ.వేలల్లో డబ్బులు పొందాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5. క్లయింట్లు తమతో పాటు ఉండటానికి, సహచరుడిగా మెలగడానికి అతనికి ప్రతి గంటకు పైన చెప్పిన విధంగా డబ్బులు ఇస్తుంటారు. గత నాలుగేళ్లలో ఈ వ్యక్తి 4000 వేల సార్లు క్లయింట్లకు తోడుగా ఉండి తన భార్యాపిల్లలను పోషించగలిగేంత డబ్బులు సంపాదించాడు. షోజి మోరిమోటో హీరో లాగా హ్యాండ్సమ్గా, సిక్స్ ప్యాక్ బాడీతో ఉంటాడా? అనుకుంటే పొరపాటే. (ప్రతీకాత్మక చిత్రం)
6. నిజానికి అతను సామాన్య వ్యక్తి లాగానే యావరేజ్ లుక్‌తో కనిపిస్తారు. కానీ ఫిమేల్ క్లయింట్లు మాత్రం ఈ జపాన్ వ్యక్తిని తమకు తోడుగా ఉంచుకునేందుకు ఎగబడతారు. వాళ్లతో తోడుగా ఉన్నప్పుడు మాట్లాడటం, తినడం, తాగడం కంటే ఎక్కువగా చేసేదేమీ ఉండదు. మోరిమోటోకి ట్విట్టర్లో దాదాపు 2.5 లక్షల ఫాలోవర్లు ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ ఫాలోవర్లలోనే చాలామంది అతనితో ఊరికే సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలా ఫాలోవర్లలోని ఎంతోమంది అతనిని రెంట్ తీసుకున్నారు. అయితే ఒకసారి రెంట్‌కు తీసుకున్న వారే అతనిని మళ్లీ మళ్లీ రెంట్‌కు తీసుకుంటారట. ఒక క్లయింట్ ఏకంగా 270 సార్లు అతన్ని అద్దెకు తీసుకున్నారట. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఒకరోజు ఏమీ తోచకపోతే ఒక వ్యక్తి మోరిమోటోని రెంట్‌కు తీసుకొని పార్క్‌కి వెళ్లి చిన్న పిల్లల ఆట ఆడుకున్నాడు. ఇంతకుమించి ఏం అడిగినా మోరిమోటో అస్సలు చేయరు. ఫ్రిడ్జ్ జరపాలని కోరినా లేదా జపాన్ వదిలి కంబోడియా రావాలని అడిగినా ఇంకా లైంగిక కోరిక తీర్చాలని కోరినా అతను మరో ఆలోచన లేకుండా ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తాడు. ఒక్కోసారి ఎలాంటి పని చేయకడమే ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుందని షోజి చెప్పుకొచ్చాడు. (ప్రతీకాత్మక చిత్రం)