Lay Offs: ఉద్యోగులకు భారీ షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. ఏకంగా 19 వేల మంది ఔట్.. వివరాలివే
Lay Offs: ఉద్యోగులకు భారీ షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. ఏకంగా 19 వేల మంది ఔట్.. వివరాలివే
ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 19 వేల మంది ఉద్యోగులకు ఇంటికి పంపించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ భారీగా ఉద్యోగాల తొలగింపునకు తెర లేపింది. త్వరలో 19,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. ఆర్థిక మాంద్యం, నిదానమైన ఆదాయ వృద్ధితో ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
దీంతో ఒకే సారి ఏకంగా 19000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది సంస్థ.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
2024 ఆర్థిక సంవత్సరం మరియు అంతకు మించి ఖర్చులను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. గణనీయ వృద్ధి అవకాశాలతో కంపెనీలో పెట్టుబడులు పెరుగుతున్నాయని సీఈఓ జూలీ స్వీట్ ఒక ప్రకటనలో తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కంపెనీ ఆదాయం US డాలర్లలో 5 శాతం పెరిగి $15.8 బిలియన్లుగా ఉంది. కొత్త బుకింగ్లు 13 శాతం పెరిగి $22.1 బిలియన్లకు చేరుకున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, యాక్సెంచర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఖర్చులను తగ్గించడానికి చర్యలు చేపట్టింది. రానున్న 18 నెలల్లోనూ ఈ కోతలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)