నివేదికల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2021లో ఫ్రెషర్లను నియమించుకునే విషయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్(TCS) 61,000 మందిని క్యాంపస్‌ల ద్వారా రిక్రూట్ చేసుకున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఒక లక్ష, ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మరో 50,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. అదే సమయంలో టీసీఎస్ 40,000 మందికి పైగా ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది.
టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం మాట్లాడుతూ..‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నియామకాల వేగాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది 40,000 మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అవసరమైతే మరింత మందిని కూడా రిక్రూట్ చేసుకుంటాం’ అని తెలిపారు. . (ప్రతీకాత్మక చిత్రం)
* వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగింపు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 25X25 మోడల్‌ను అవలంబిస్తోంది. దీని లక్ష్యం ప్రజలను తిరిగి ఆఫీస్‌లకు తీసుకురావడం, క్రమంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌గా మార్చడం. ఈ 25X25 మోడల్ ప్రకారం.. 2025 నాటికి కంపెనీలోని 25 శాతం మంది ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)