సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ దేశవ్యాప్తంగా 30,000 పోస్టుల భర్తీకి ఆన్‌బోర్డ్ ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కరోనా కారణంగా కుదేలైన అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఐటీ రంగంలో కూడా కార్యకలాపాలు ఊపందుకోవడంతో అన్ని సంస్థలు తాజాగా నియామకాలను చేపడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
యాక్సెంచర్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆగస్టు 31, 2021 నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 2,50,000 మందిని యాక్సెంచర్ రిక్రూట్ చేసుకుంది. నియామకాల్లో ఇదే వేగంతో కొనసాగితే, ఆగస్టు 2022 చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,00,000ను దాటగలదని పోర్టల్ నివేదిక తెలిపింది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 70,000 మంది ఉద్యోగులను, ప్రపంచవ్యాప్తంగా 1.62 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం గ్లోబల్ హెడ్‌కౌంట్ 6,99,000కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
మరోపక్క దిగ్గజ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కూడా నియామకాల్లో దూకుడు పెంచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో TCS 40,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. మరో మేజర్ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా 50,000 మందిని నియమించుకోవాలని చూస్తోంది. మార్చి 2022 త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు గత త్రైమాసికంతో పోల్చితే 25.5 శాతం నుంచి 27.7 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీనిపై ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ స్పందిస్తూ.. త్రైమాసికంలో అట్రిషన్ శాతం, హెడ్ కౌంట్ సంఖ్య రెండింటిలోనూ దాదాపు 5% తగ్గిందని అభిప్రాయపడ్డాడు. ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ కూడా దాదాపు ఇదే విషయాన్ని వెల్లడించింది.గత త్రైమాసికంలో అట్రిషన్ రేటు తగ్గిందని నొక్కి చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత పెరిగింది. ఐటీ రంగం కూడా ఈ పద్దతినే అవలంభించాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో పలు ఐటీ సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 25/25 మోడల్ స్వీకరించడానికి కట్టుబడి ఉన్నామని టీసీఎస్ స్పష్టం చేసింది. దీంతో కంపెనీ అసోసియేట్స్ 25 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా కార్యాలయం నుండి పని చేయాల్సిన అవసరం ఉండదు. వారు ఆఫీస్‌లో 25 శాతానికి మించి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
TCS అప్పుడప్పుడు ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఆఫీసుల్లో ఉద్యోగుల పనితనం మెరుగుపర్చడానికి ఇది దోహదపడుతుంది. వీటి సహాయంతో ఉద్యోగులు టీసీఎస్ ఎదైనా కార్యాలయం నుంచి పనిచేయడానికి, సహచర టీం సభ్యులతో ఇంటరాక్ట్ కావడానికి అనుమతి ఇస్తుంది. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఆఫీసులకు వచ్చేలా ప్రేరేపిస్తుంది. దీన్ని దశల వారీగా చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)