ఐటీ కంపెనీల్లో (IT Companies) ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా తర్వాత అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. ఇటీవల చాలా ఐటీ సంస్థలు లాభాలను ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఎక్కువ మంది ఉద్యోగులను (Employees) రిక్రూట్ చేసుకోనున్నట్లు స్పష్టం చేశాయి. చాలా సంస్థలు ఉద్యోగులను ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీగా ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగులకు సరికొత్త సేవలందిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఒక ఐటీ కంపెనీ. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ, ఉద్యోగులను ఆకర్షించేందుకు వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తూ వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని (Tamilnadu) మధురైకి (Madurai) చెందిన ఒక ఐటీ సంస్థ, ప్రైవేట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ SMI లేదా శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (Sri Mookambika Infosolutions) తమ ఉద్యోగులకు జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేయడంతో పాటు స్పెషల్ ఇంక్రిమెంట్స్ అందిస్తోంది.
ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ 2006లో శివకాశిలో ప్రారంభమైంది. 2010 నుంచి మదురైలో సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ మొదటి రోజు నుంచి ఉద్యోగుల పాలసీలో స్పెషల్ మ్యారేజ్ ఇంక్రిమెంట్‌ను అందిస్తోంది. ఉద్యోగులు పెళ్లి చేసుకోవడంలో సహాయపడటానికి ఉచితంగా సంబంధాలు కుదిర్చేందుకు మ్యాచ్ మేకింగ్ సర్వీస్‌ను కూడా తీసుకొచ్చినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, CEO MP సెల్వగణేష్ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
కంపెనీ తమ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 6- 8 శాతం చొప్పున రెండు ఇంక్రిమెంట్లను అందజేస్తుంది. గ్రామాల నుంచి వచ్చిన చాలా మంది ఉద్యోగులు.. పెళ్లికి సరైన వ్యక్తిని కనుగొన లేక పోవటంతో మ్యాచ్ మేకింగ్ సేవలను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇలా SMI కంపెనీ సరికొత్త ఎంప్లాయీ రిటెన్షన్ ప్లాన్‌తో గుర్తింపు పొందింది. (ప్రతీకాత్మక చిత్రం)