ISRO RECRUITMENT 2021 VSSC HAS INVITED APPLICATIONS FOR 19 NEW VACANCIES LAST DATE FOR TO APPLY IS APRIL 9 NS
ISRO Recruitment 2021: ఇస్రోలో రూ.47 వేల వేతనంతో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే
ఉద్యోగాల భర్తీకి ఇస్రో నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్(SPA), రీసెర్చ్ అసోసియేట్(RA) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు ప్రముఖ ఇండియన్ స్టేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడులైంది. సంస్థకు చెందిన విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ లో ఈ నియామకాలు చేపట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
ఇంజనీర్స్, పోస్టుగ్రాడ్యుయేట్స్, డాక్టోరియల్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 31 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 42 వేలు, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 47 వేలు వేతనంగా చెల్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 16 జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఒక పోస్టు ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్, మరో రెండు ఖాళీలు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేసిన వారి కోసం రెండు JRF ఖాళీలు ఉన్నాయి. -కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం మూడు జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
embedded systems, VLSI, microelectronics, VLSI, microelectronicsలో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో ఓ ఖాళీ ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
embedded polymer engineering/rubber technology లో ఎంటెక్, బీటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. ఎయిరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
డిజైన్, థర్మల్, స్ట్రక్చరల్, మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం ఒక జేఆర్ఎఫ్ ఖాళీ ఉంది. ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం ఒక ఖాళీ, కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం 4 జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
PhD చేసిన వారు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
ఎలా అప్లై చేయాలంటే.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు VSSC వెబ్ సైట్లో ఏప్రిల్ 9లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ఈ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)