1. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉచితంగా ఆన్లైన్లో మెషీన్ లెర్నింగ్ కోర్సు అందిస్తోంది. ఐదు రోజుల్లో ఈ కోర్సు పూర్తి చేయొచ్చు. 'మెషీన్ లెర్నింగ్ టు డీప్ లెర్నింగ్: ఏ జర్నీ ఫర్ రిమోట్ సెన్సింగ్ డేటా క్లాసిఫికేషన్' పేరుతో ఈ కోర్సు అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. డెహ్రడూన్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రోకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్-IIRS ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఇస్రో అందిస్తున్న మెషీన్ లెర్నింగ్ కోర్సు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. ఇస్రో ఉచిత ఆన్లైన్ కోర్సు జూలై 5 నుంచి జూలై 9 వరకు ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. ఐఐఆర్ఎస్ డెహ్రడూన్ ఇక్లాస్ పోర్టల్ ద్వారా లైవ్‌లో కోర్సులో హాజరుకావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసినవారు ఎవరైనా ఈ కోర్సు చేయొచ్చు. రిమోట్ సెన్సింగ్ డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు చేసేవారికి ఇది ఉపయోగకరం. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. ఈ కోర్సు చేసేవారు ఆన్లైన్లో 70 శాతం సెషన్స్‌కి హాజరుకావాలి. ఐఐఆర్ఎస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆఫ్‌లైన్ సెషన్స్ కూడా చూడొచ్చు. ఆఫ్‌లైన్ సెషన్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)