1. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 55 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులున్నాయి. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. (image: IPPB)
3. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ రాతపరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది. అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి నెలకు రూ.30,000 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకున్న తర్వాతే అప్లై చేయాలి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్సైట్ https://www.ippbonline.com/ ఓపెన్ చేయాలి. Careers సెక్షన్లో గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ ఉంటుంది. Click here to apply పైన క్లిక్ చేయాలి. కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. Click here for New Registration పైన క్లిక్ చేయాలి. మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. రెండో దశలో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఆరో దశలో ఫీజు పేమెంట్ చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. అంటే మరో మూడు రోజులు మాత్రమే అభ్యర్థులకు గడువు ఉంది. జూన్ 4 వరకు దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. జూన్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఫలితాలు కూడా జూన్‌లో విడుదలవుతాయి. IPPB అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేయొచ్చు. (image: Official Notification)
7. మరోవైపు ఇండియా పోస్ట్ 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జూన్ 5 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)