ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 626 అప్రంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 17న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్హతల వివరాలు: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-24 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అయితే టెన్త్ మార్క్స్ మెమోను వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రంగా పరిశీలిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)