ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 527 అప్రంటీస్ ఖాళీలను(Apprentice Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తులకు డిసెంబర్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తూర్పు భారతదేశంలో(Eastern India) పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన వారికి అప్రంటీస్ యాక్ట్ 1961 లేదా 1973 ప్రకారం నెల వారీగా స్టైఫండ్ చెల్లించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఖాళీల వివరాలు.. ట్రేడ్ అప్రంటీస్, టెక్నికల్ అప్రంటీస్, ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్, ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రేడ్ అప్రంటీస్ రిటైల్ సేల్స్ అసోసియేట్(ఫ్రెషర్), ట్రేడ్ అప్రంటీస్ రిటైల్ సేల్స్ అసోసియేట్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ట్రేడ్ అప్రంటీస్: టెన్త్ తో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మర్చంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లో ఐటీఐ చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
టెక్నీషియన్ అప్రంటీస్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్: 50 శాతం మార్కులతో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెషర్ అప్రంటీస్): 12వ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్): ఇంటర్ లేదా ‘డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్’ విభాగంలో స్కిల్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
(ప్రతీకాత్మక చిత్రం)
ట్రేడ్ అప్రంటీస్-రిటైల్ సేల్స్ అసోసియేట్(ఫ్రెషర్): ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రంటీస్-రిటైల్ సేల్స్ అసోసియేట్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్): ఇంటర్ పాసవడంతో పాటు రిటైల్ ట్రైనీ అసోసియేట్ స్కిల్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
Step 4: అనంతరం Engagement of Technical and Non -Technical Apprentices in IOCL, Eastern Region కనిపిస్తుంది. దాని కింద Advertisement No: IOCL/MKTG/ER/APPR/2021-22/1, APPLY ONLINE అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. Step 5: APPLY ONLINE ఆప్షన్ ను ఎంచుకోవాలి. Step 6: అక్కడ పేరు, రాష్ట్రం, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)