1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా, ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 15 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 570 ఖాళీలను ప్రకటించింది. వెస్టర్న్ రీజియన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలోని ఐఓసీఎల్ యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ గడువు 12 నెలలు. రాతపరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అంతకన్నా ముందు ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (RDAT) పోర్టల్, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (BOAT) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఆ తర్వాతే ఐఓసీఎల్ వెబ్సైట్లో అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 570 పోస్టులున్నాయి. అందులో మహారాష్ట్ర- 322, గుజరాత్- 121, మధ్యప్రదేశ్- 80, చత్తీస్‌గఢ్- 35, గోవా- 8, దాద్రా నగర్ హవేలీ- 4 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్ అసోసియేట్ లాంటి సబ్జెక్ట్స్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కోర్సు పూర్తి చేసి మూడేళ్లు పూర్తైనవారు అర్హులు కాదు. బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, ఎల్ఎల్బీ, ఎంసీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయకూడదు. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు RDAT పోర్టల్, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు BOAT పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత https://www.rectt.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Candidate Registration పైన క్లిక్ చేయాలి. టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ టెక్నికల్, ట్రేడ్ అప్రెంటీస్ నాన్ టెక్నికల్ పోస్టులకు లింక్స్ వేర్వేరుగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పోస్టు పేరు సెలెక్ట్ చేసి Apply పైన క్లిక్ చేయాలి. RDAT లేదా BOAT రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. విద్యార్హతల సర్టిఫికెట్స్, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)