Telangana Inter Exams: ఇన్నాళ్లూ కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ తరగతులు నిర్వహించడంపాటూ... ఎగ్జామ్స్ కూడా జరిపేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. "ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై విద్యార్థులకు ఓ వారంలో స్పష్టత ఇస్తాం. అలాగే సిలబస్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నింటిపైనా వారంలో క్లారిటీ ఇస్తాం" అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి... విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలతో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే అంశంపై చర్చించారు. (ప్రతీకాత్మక చిత్రం)