INTER SECOND YEAR EXAMS CANCELLED IN TELANGANA HERE IS THE PROCEDURE TO CALCULATE MARKS SK
Telangana Inter Exams: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు.. మరి మార్కులు ఎలా ఇస్తారంటే..?
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా సెకండ్ ఇయర్ పరీక్షలనురద్దు చేశారు.
మంళవారంపై ఇంటర్ పరీక్షలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. కానీ సమవేశం అనంతరం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే పరీక్షలు రద్దుచేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్కుల కేటాయింపుపై త్వరలో కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. కమిటీ నిర్ణయం ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఐతే పరీక్షలు రాయాలనుకునే వారు పరిస్థితులు చక్కబడిన తర్వాత..రాయవచ్చని ఆమె పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ పరీక్షలను రద్ద చేయాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షలను రద్దుచేసింది ప్రభుత్వం.ప్రతీకాత్మక చిత్రం)