* భారీగా అప్లికేషన్లు : నివేదిక ప్రకారం.. 2020, 2022 మధ్య రైల్వే రిక్రూట్మెంట్లో భాగంగా దాదాపు 3.65 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. లెవల్ 1 కేటగిరీలో 1,03,769 పోస్టులు ఉన్నాయి. పాయింట్మెన్, ఎలక్ట్రికల్ వర్క్స్, ట్రాన్స్పర్సన్స్, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్ల ఖాళీలతో సహా లెవల్ 1 పోస్టులకు ఇప్పటివరకు 1.1 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేశారు.
* కరోనా నిబంధనలతో పెరిగి జాప్యం : కరోనాకి ముందు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్ సెంటర్లో సులువుగా 1,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేవారు. కరోనా సమయంలో భౌతిక దూరం నిబంధనల కారణంగా ఒక ఎగ్జామ్ సెంటర్లో 200 నుంచి 300 మందికే అనుమతి కల్పించారు. కరోనావైరస్ మార్గదర్శకాలు, నిబంధనలు పరీక్షలను నిర్వహించే రోజుల సంఖ్యను పెంచాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం నెలకొనడానికి ఇది కూడా ప్రధాన కారణం.
* రూ.1,200 కోట్లకు పైగా నష్టం : రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లను నిర్వహించడానికి భారతీయ రైల్వేలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), నేషనల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NCIT), Aptech వంటి కొన్ని IT కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. పరీక్షల ప్రతి దశలో ఒక్కో అభ్యర్థికి రైల్వే శాఖ దాదాపు రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది. పరీక్షల నిర్వహణకు రైల్వే శాఖకు రూ.1,200 కోట్లు పైగా నష్టం వాటిల్లిందని సమాచారం.