నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. రానున్న సంవత్సరంలో ఏకంగా 1,48,463 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేర 48వేల 463 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. రానున్న 18 నెలల్లో 10 లక్షలకు పైగా నూతన ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన విడుదలైన వెంటనే రైల్వే శాఖ సైతం భారీగా ఉద్యోగాల భర్తీపై ప్రకటన విడుదల చేసింది.
గడిచిన ఎనిమిది ఏళ్లలో ఏడాదికి సగటున 43,678 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఆ సంఖ్యను భారీగా పెంచినట్లు తెలిపింది. గత ఏనిమిదేళ్లలో (2014-15 నుంచి 2021-22 వరకు) రైల్వే శాఖ 3,49,422 మందిని నూతనంగా నియమించుకుంది. తాజాగా మరో లక్షా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రానున్న 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్లో భర్తీ చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను, విభాగాలను ఆయన ఆదేశించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీ అనంతరం ప్రధాని ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈ ఆదేశాలను జారీ చేసింది.
వాస్తవానికి ఏప్రిల్ నుంచే భారీగా ఉద్యోగాల భర్తీ విషయంపై కేంద్రం తన కసరత్తు ప్రారంభించింది. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను ఆయా శాఖలూ ప్రధాని కార్యాలయానికి తన నివేదికల ద్వారా సమర్పించాయి. ఈ క్రమంలో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని ఇటీవల భేటీ అయ్యి నాలుగు గంటలపాటు చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (Recruitment Agencies)లు 10 లక్షల మందిని ఆన్బోర్డ్ లోకి తీసుకురావడానికి రాబోయే 18 నెలల్లో తమ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవాలి. ఎందుకంటే మోదీ చెప్పిన టార్గెట్ ప్రకారం రోజూ దాదాపు 1,850 మందిని ఏజెన్సీలు నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ప్రధాని ఆదేశించారు.