Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్, పదో తరగతి అర్హత..
Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్, పదో తరగతి అర్హత..
Railway Jobs: భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ రైల్వేస్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ రైల్వేస్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2422 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ ఖాళీలు సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి. వీటికి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చు. దీని కోసం, అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను rrccr.com సందర్శించి దరాఖాస్తు చేసుకోవాలి. ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 జనవరి 2023 . ఈ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 15 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించవలసి ఉంటుంది. అయితే SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
10+2 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా.. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దరఖాస్తు చేయడానికి.. ముందుగా అధికారిక వెబ్సైట్ అంటే rrccr.comని సందర్శించండి. ఇక్కడ హోమ్‌పేజీలో లింక్ ఇవ్వబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
దానిపై ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫారమ్ లో పేర్కొన్న వివరాలను నింపి.. దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులను అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయనున్నారు. ప్రతీకాత్మక చిత్రం)