ఇండియన్ నేవీలో (Indian Navy) మరో సారి భారీగా ఉద్యోగాల (Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1531 ట్రేడ్స్ మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రోప్లేటర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, రాడార్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రిగ్గర్, వెపన్ ఫిట్టర్, షిప్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, పెయింటర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. విద్యార్హతల వివరాలు:
టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో అప్రెంటీస్ షిప్ తో పాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.19,900 నుంచి 63,200 వరకు వేతనంగా చెల్లించనున్నారు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)