1. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో నావిక్, యాంత్రిక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 358 ఖాళీలున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://joinindiancoastguard.cdac.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021 జనవరి 19 సాయంత్రం 6 గంటల్లోగా అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు. యాంత్రిక్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 22 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250. వేతనాల వివరాలు చూస్తే నావిక్ పోస్టుకు రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు, యాంత్రిక్ పోస్టులకు రూ.29,200 + డీఏ + ఇతర అలవెన్సులు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)