Central Government Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.56,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..
Central Government Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.56,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..
ఇండియన్ కోస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ కోస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి. జనరల్ డ్యూటీ (జీడీ) పోస్టులు 40, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ) 10, టెక్నికల్ (మెకానికల్) 06, టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) 14, లా ఎంట్రీ పోస్టులు 01 ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్/ లా) పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
జీడీ, టెక్నికల్ పోస్టులకు జూలై 01, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య జన్మించి ఉండాలి. కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య; లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ పోస్టులు మొత్తం 5 స్టేజ్ లలో పూర్తి చేస్తారు. ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. రూ.56,100 చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 09, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://joinindiancoastguard.cdac.in/ ను సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)