Government Jobs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కు గుడ్ న్యూస్.. రూ.1.77 లక్షల జీతంలో ఉద్యోగాలు..
Government Jobs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కు గుడ్ న్యూస్.. రూ.1.77 లక్షల జీతంలో ఉద్యోగాలు..
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న మహిళలు, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న మహిళలు, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 11 జనవరి 2023 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 9 ఫిబ్రవరి 2023 వరకు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆర్మీ 175 మంది పురుషులు మరియు 14 మంది మహిళలను రిక్రూట్ చేసుకోనుంది . ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ SSAC కింద జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అర్హతలు ఈ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE, B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థులందరూ తమ పాస్ సర్టిఫికెట్ను అక్టోబర్ 1, 2023లోపు చూపించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
జీతం లెఫ్టినెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వేతనం లభిస్తుంది. దీనితో పాటు మిలిటరీ సర్వీస్ పే రూ.15,500 చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో కూడా నెలకు రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)