1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల (Gramin Dak Sevak Posts) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 38,926 పోస్టులున్నాయి. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 15 ఏళ్ల అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సిస్టమ్ ద్వారా మెరిట్ లిస్ట్ జనరేట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఇండియా పోస్ట్. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసేప్పుడే అన్ని వివరాలు సరిగ్గా వెల్లడించాలి. ఆప్షన్స్ ఎంచుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులనే మెరిట్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. వెయిటేజీ కూడా ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గ్రేడ్ వైజ్ మార్కులు వచ్చినవారికి 9.5 తో గుణించి మెరిట్ లెక్కిస్తారు. ఒక అభ్యర్థి మెరిట్ ద్వారా ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికైనట్టైతే సదరు అభ్యర్థి ఎంచుకున్న ప్రిఫరెన్స్‌ని బట్టి పోస్ట్ కేటాయిస్తారు. ఎంపిక ప్రక్రియలో రిజర్వేషన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముందుగా ఎక్కువ వయస్సు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత ఎస్టీ ట్రాన్స్‌వుమెన్, ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్‌వుమెన్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్‌వుమెన్, ఓబీసీ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్‌వుమెన్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, అన్రిజర్వ్డ్ ట్రాన్స్‌వుమెన్, అన్రిజర్వ్డ్ ఫీమేల్, ఎస్టీ ట్రాన్స్మేల్, ఎస్టీ మేల్, ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ ట్రాన్స్మేల్, ఓబీసీ మేల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, అన్రిజర్వ్డ్ ట్రాన్స్మేల్, అన్రిజర్వ్డ్ మేల్ ఆర్డర్లో రిజర్వేషన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాలి. ఎంపికైనవారికి ప్రొవిజినల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఇమెయిల్ ద్వారా వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. ఒకవేళ అభ్యర్థి స్పందించకపోతే ఫైనల్ రిమైండర్ ఇమెయిల్, ఎస్ఎంఎస్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వస్తుంది. విధుల్లో చేరడానికి కొంత సమయం కూడా ఇస్తారు. అయినా అభ్యర్థి నుంచి స్పందన రాకపోతే ఆ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)