1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వేర్వేరు సర్కిళ్లల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక పలు పోస్టల్ సర్కిళ్లల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు పామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 16 ఖాళీలు ఉండగా అందులో చెన్నై సిటీ రీజియన్- 6, సెంట్రల్ రీజియన్- 10 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చాయడానికి 2022 ఆగస్ట్ 12 చివరి తేదీ. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్మెంట్ సెక్షన్లో చెన్నై మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: O/o the Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai 600 006. (ప్రతీకాత్మక చిత్రం)