1. ఇండియా పోస్ట్ ఇటీవల దేశవ్యాప్తంగా 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. కొన్ని రాష్ట్రాల ఫలితాలు కూడా విడుదల చేసింది. మరోవైపు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) కూడా దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్పుడు ఇండియా పోస్ట్ మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ముంబైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 17 పోస్టులున్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్ సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులివి. అప్లై చేయడానికి 2022 జూన్ 30 చివరి తేదీ. డిప్యుటేషన్, అబ్సార్ప్షన్ పద్ధతి ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్ పే స్కేల్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్ లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ.19,900 వేతనం లభిస్తుంది. వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ అప్లై చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు పామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. రిక్రూట్మెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. దరఖాస్తులు 2022 జూన్ 30 సాయంత్రం 5 గంటల్లోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)