1. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) సంస్థలో పలు కేటగిరీల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు మైసూరు, చెన్నై, బెంగళూరులో ఉన్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ యూనిట్లలో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 29 పోస్టుల్ని ప్రకటించింది ఇండియా పోస్ట్. అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్ సూపర్వైజర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం ఖాళీల్లో 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 6 టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిప్యూటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది. (Source: Official Notification)
3. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 15 చివరి తేదీ. ఈ పోస్టుల్ని డిప్యుటేషన్ ద్వారా ఎంపిక చేస్తోంది ఇండియా పోస్ట్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
5. టెక్నికల్ సూపర్వైజర్ పోస్టుకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ఏడాది అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://ccc.cept.gov.in/technicalposts/ లింక్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ లాంటివి ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత https://ccc.cept.gov.in/technicalposts/ మరోసారి ఓపెన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి వచ్చిన వివరాలతో లాగిన్ కావాలి. విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. Preview పైన క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలు చెక్ చేసుకోవాలి. Submit పైన క్లిక్ చేసి దరఖాస్తు పామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)