1. ఇండియా పోస్ట్ మహారాష్ట్ర పోస్టల్ సర్కిల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు గత నెలలోనే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 9 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థులకు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంతో పాటు మోటార్ మెకానిజంలో పరిజ్ఞానం, అనుభవం ఉండాలి. కనీసం 3 ఏళ్లు హెవీ, లైట్ మోటార్ వెహికిల్స్ నడిపిన అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)