Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
India Post Recruitment 2021 | ఇండియా పోస్ట్ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
1. చెన్నైలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. టైర్‌మ్యాన్, కాపర్ అండ్ టిన్‌స్మిత్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు 2021 మే 25న ముగుస్తుందని ముందే ప్రకటించినా, గడువు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఖాళీల వివరాలు చూస్తే ఎంవీ మెకానిక్-5, కాపర్ అండ్ టిన్‌స్మిత్-1, పెయింటర్-1, టైర్‌మ్యాన్-1, ఎంవీ ఎలక్ట్రీషియన్-1 లాంటి పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 10 లోగా దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. 8వ తరగతి పాస్ అయినవారు ఏడాది ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. అభ్యర్థులు పోస్టులోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి స్పీడ్ పోస్టు ద్వారా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు అప్లికేషన్ ఫామ్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://www.indiapost.gov.in/ లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నెంబర్ 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006. దరఖాస్తులు 2021 జూన్ 10 సాయంత్రం 5 గంటల్లోగా ఈ అడ్రస్‌కు చేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)